Israel's plan on Hez Bolla: హెజ్ బొల్లా చుట్టూ కృత్రిమ ప్రపంచం సృష్టి..! 15 d ago

featured-image

లెబనాన్ లో హెజ్ బొల్లాను అంతం చేయడానికి ఇజ్రాయెల్ దాదాపు పదేళ్ల క్రితమే పక్కా ప్లాంయింగ్ ను ఏర్పాటుచేసింది. అందులో భాగంగానే ఆ గ్రూప్ చుట్టూ ఏకంగా ఓ కృత్రిమ ప్రపంచాన్నే సృష్టించిందట. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసి ఇటీవల రిటైరైన ఇద్దరు అధికారులు స్వయంగా వివరించారు. దీనివల్ల హెజ్ బొల్లాపై వాకీటాకీల ఆపరేషన్ కు సంబంధించి మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. తాము లక్ష్యాలకు గురిపెట్టి ఏళ్ల తరబడి సిద్దమైనట్లు తెలిపారు. అమెరికాలోని ఓ ఛానెల్ నిర్వహించే 60 మినిట్స్ కార్యక్రమంలో ఈ విషయాలను పేర్కొన్నారు.

పేలుడు పదార్థాలు నింపిన వాకీటాకీలను హెజ్ బొల్లా కేడర్లోకి చొప్పించాలన్న ప్లాన్ దాదాపు 10 ఏళ్ల క్రితమే ఊపిరి పోసుకొందని వారిలో ఒక ఏజెంట్ తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి తాము వాకీటాకీలు కొంటున్నామన్న విషయాన్ని అసలు హెజ్ బొల్లా ఊహించలేకపోయిందన్నారు. ఆ సంస్థ చుట్టూ ఏకంగా కృత్రిమ ప్రపంచాన్నే సృష్టించినట్లు వారు వెల్లడించారు.

పేలుడు పదార్థాలు అమర్చిన పేజర్లను కూడా హెజ్ బొల్లాలోకి చేర్చే పనిని 2022లోనే మొదలుపెట్టామన్నారు. తైవాన్ నుంచి ఆ సంస్థ కమ్యూనికేషన్ పరికరాలు కొనాలని నిర్ణయించుకోగానే.. ఒక్కసారిగా మొస్సాద్ అప్రమత్తమైంది. తాము మిలిటెంట్ గ్రూప్ కు అంటగట్టాల్సిన పేజెర్ల సైజును.. తగిన మొత్తంలో పేలుడు పదార్థాలు అమర్చేలా చిన్నగా, పెద్దగా ఉండేటట్లు చూసుకొంది. ఇది కేవలం దానిని వాడే హెజ్ బొల్లా ఫైటర్ను మాత్రమే గాయపర్చేలా పలుమార్లు డమ్మీలను పరీక్షించింది. ఆ పేజర్లలో ఎలాంటి రింగ్ టోన్ మోగితే తక్షణమే దానిని జేబులోంచి తీసి లిఫ్ట్ చేస్తారనే వాటిపైన ప్రయోగాలు చేసింది.

హెజ్బొల్లాతో ఆ పేజర్లను కొనుగోలు చేసేందుకు ఒప్పించేలా యూట్యూబ్ లో వాణిజ్య ప్రకటనలను ఇవ్వడం ప్రారంభించాము. సరికొత్త పేజర్లు డస్ట్ ప్రూప్, వాటర్ ప్రూఫ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ ను ఇస్తాయని చెప్పుకొచ్చింది. హంగేరీ కేంద్రంగా సెల్ కంపెనీని మొదలుపెట్టి తైవాన్ కంపెనీ గోల్డ్ పోలోతో ఒప్పందం ఏర్పాటు చేసుకొంది.

తాము ఇజ్రాయెల్ తో కలిసి డీల్స్ చేసుకొంటున్న విషయం హెజ్బొల్లాకు కూడా తెలియదు. "ట్రూమన్ షో వలే చేశాము. ప్రతి ఒక్కటీ తెరవెనక మా నియంత్రణలోనే ఉంది. వారు మాత్రం అన్నీ సాధారణంగా ఉన్నాయనే అనుకుంటుండేవారు. కానీ, ప్రతీది ఇజ్రాయెల్ మద్దతుతోనే జరిగేది. మార్కెటింగ్, ఇంజినీరింగ్, షోరూమ్ ఇలా ప్రతిఒక్కటీ మా కనుసన్నల్లోనే ఉంది" గాబ్రియల్ అనే మాజీ ఏజెంట్ పేర్కొన్నాడు. 'ట్రూమన్ షో' అనేది 1998లో విడుదలైన ఓ సైకలాజికల్ డ్రామా. అందులో ఓ వ్యక్తి చుట్టూ పూర్తిగా కృత్రిమ ప్రపంచాన్ని సృష్టిస్తారు. అతడు మాత్రం అందరూ తన వాళ్లేనని అనుకొంటాడు.సెప్టెంబర్ నాటికి హెజ్ బొల్లా దళాల జేబుల్లోకి 5,000 పేజర్లు చేరాయి. దీంతో ఆ నెల 17వ తేదీన ఇవి ఒక్కసారిగా మోగటం మొదలు పెట్టి పేలాయి. నిజానికి వాటిని పేల్చేందుకు వాడిన ఎన్‌క్రిప్టెడ్‌ సందేశం వచ్చిన వేళ.. దానిని చదివేందుకు ప్రయత్నించ‌కపోయినా సరే అవి పేలేటట్లు పేజర్లను డిజైన్ చేశారు.

ఇక హెజ్బెల్లాను గుక్కతిప్పుకోనీయకూడదు అనుకొన్న ఇజ్రాయెల్.. ఆ మర్నాడే పేజర్ల మృతుల అంత్యక్రియల్లో వాకీటాకీలను పేల్చింది. తాము హెజ్ బొల్లా ఫైటర్లను చంపాలని కాదని.. వారికి ఓ సందేశం ఇవ్వాలని ఈ ప్లాన్ చేసినట్లు గాబ్రియేల్ తెలిపారు. "చనిపోయిన వారు, గాయపడినవారిని ఆస్పత్రుల్లో చేర్చి చికిత్సను అందించాలంటే వారి వద్ద డబ్బులు ఉండాలి. చేతులు, కళ్లు కోల్పోయి వికలాంగులుగా మారినవారు లెబనాన్లో తిరుగుతుంటే. మా జోలికివస్తే ఏమవుతోందో అనే సందేశానికి వీరు సజీవ సాక్ష్యాలుగా మిగులుతారు" అని వెల్లడించింది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ నేరుగా తీవ్రస్థాయిలో వైమానిక దాడులు చేశాయి. కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ అగ్రనేత హసన్ నస్రుల్లాను చంపేసింది. పేజర్ల దాడుల తర్వాత లెబనాన్ ఏసీలు వాడేందుకు కూడా ప్రజలు భయపడ్డారని మరో ఇజ్రాయెల్ ఏజెంట్ పేర్కొన్నారు


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD